గ్రీన్ చాంపియన్ అవార్డు అందుకున్న మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి

తెలంగాణ ప్రభ (కోరుట్ల):"ప్రపంచ పర్యావరణ దినోత్సవం" సందర్భంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా కోరుట్ల పురపాలక సంఘం "టిజిపిసిబి గ్రీన్ చాంపియన్" అవార్డుకు ఎంపిక కాగా, బుధవారం హైదరాబాద్ లోని ఓ కార్యక్రమంలో టిజిపిసిబి ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి ఏ.వాణీ ప్రసాద్ ఐఏఎస్ చేతుల మీదుగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బి.తిరుపతి గ్రీన్ చాంపియన్ అవార్డును అందుకున్నారు. 

ఈ సందర్భంగా కమీషనర్ తిరుపతి మాట్లాడుతూ కోరుట్ల మున్సిపల్ కు టిజిపిసిబి గ్రీన్ చాంపియన్ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అవార్డు రావడానికి సహకరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు.

.