గ్రామాలలో పి.ఎం.పి. క్లినిక్స్ సెంటర్లను తనిఖీ

మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్.

తెలంగాణ ప్రభ (కోటగిరి):కోటగిరి  మండలంలోని ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ ఆధ్వర్యంలో  ఎత్తోండ,  కొత్తపల్లి గ్రామాలలో తిరుగుతూ పిఎంపి క్లినిక్స్ తోపాటు ఇండ్లను సందర్శించి ప్రథమ చికిత్స అందించే సిబ్బంది వివరాలు సేకరించటం జరిగిందన్నారు. వారు నిర్వర్తిస్తున్న క్లినిక్స్ పరిశీలించారు.  వారు మండలం విస్తరణ అధికారితో మాట్లాడుతూ   ...ప్రథమ చికిత్సమాత్రమే అందచేస్తున్నాం అని తెలిపారు.  వారి నుండి అధికారుల ఆదేశాల మేరకు పూర్తిగా వివరాలు సేకరించటం జరిగిందని అన్నారు.   పిఎంపి సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఫోటోతో పాటు  మిగిలిన వివరాలు తెలుసుకొని ఉన్నత అధికారులకు అందచేయటం జరుగుతుందన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నవారు  స్థానిక సిబ్బంది ప్రమీల, లలిత, సరోజ ఆశాలు వర్కర్లు పాల్గొన్నారు.

.