కోరుట్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సంబరాలు

కేక్ కట్ చేస్తూ తినిపిస్తున్న కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మానుక ప్రవీణ్ కుమార్.

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ జనసేన నేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కానీ విని ఎరగని పెద్ద మెజారిటీతో గెలుపొంది, నూతన ప్రభుత్వం ఏర్పాటు  చేయడంతో తెలుగుదేశం పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు కలిసి సంబరాలు జరుపుకొని, టపాసులు  కాల్చి అనంతరం స్వీట్లు,  కేక్ కట్ చేశారు  

మానుక ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టిడిపి రథసారధి నారా చంద్రబాబు నాయుడు  యువ నేత నారా లోకేష్ బాబు కృషితో అధికారం చేపట్టి పాదయాత్రలో ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని ప్రజా యాత్రలో చెప్పిన కార్యక్ర మాలు రాబోయే రోజుల్లో టిడిపి చేపట్టుతుందని ఆయన అన్నారు 

కేంద్రంలో కూడా బాబు  ఆధ్వర్యంలో ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వము ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు 

ఈ సమావేశంలో టిడిపి నాయకులు గజ్జల్లి రాజ గణేష్, ఎండి రఫీ ఉద్దీన్, కటుకం మహాదేవ్, డాక్టర్ బాదం మోహన్, బాలే మారుతి, అంజయ్య, సిద్దు, ఎండి ఆసిఫ్, శంకర్, రాజేష్ ,చిల్వేరి మహేశ్వరి ,బి విజయ, ఎల్ రాణి, కే దివ్య ,లలిత, సదుమసుల శాంత, జ్యోతి, లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు.

.