ఘనంగా రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో  బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కులకర్ణి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండాను పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ఆవిష్కరించారు .అనంతరం మండలంలోని ప్రజలందరికీ బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా కోటగిరి గ్రామ బిఅర్ఎస్ అధ్యక్షులు అనిల్ కుమార్ కులకర్ణి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రాన్ని ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందన్నారు. స్ఫూర్తితో సాధించుకున్న స్వరాష్టంలో ఆర్థిక సమానత్వం  స్వావలంబన  దిశగా సాగిద్దాం బంగారు తెలంగాణ దీశగా ప్రయాణిద్దాం అని కొనియాడారు. 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభసందర్భంగా మండల ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్య క్రమంలో ప్రాథమిక సహకార సంఘం కూచి సిద్దు,శ్రీధర్,పి సాయిలు,బ్యాగరి  రాములు,హన్మాండ్లు, సాయిబాబా, పోశెట్టి,హస్గుల విజయ్,గంగారాం,కన్నం సాయిలు,అబ్బయ్య పోశెట్టి,పేగు లాలయ్య,పాల గంగారాం,మారుతి,తదితరులు పాల్గొన్నారు.

.