తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఇటీవల జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వొడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ ఎన్నికైన సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లని వేరు వేరుగా వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వారిని సన్మానించి కృతజ్జతలు తెలిపిన జిల్లా మున్నూరుకాపు సంఘం..
ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ ,ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి చిట్ల రమణ లకు మున్నూరుకాపు కుల బంధావులకు శుభాకాంక్షలు తెలిపారు , మున్నూరు కాపుల అభ్యున్నతికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు వుంటాయని తెలిపారు
ఈ కార్యక్రమంలో రాచకొండ శ్రీరాములు, లైశెట్టి వెంకన్న, బండారి విజయ్, కూసరిఅనిల్, అత్తినేని నరేష్,వొడ్నాల రమేష్ అనంతుల మహేష్,చల్ల హరీశంకర్,తీగల వెంకన్న, ముదం శ్రీనివాస్,చుక్క గంగారెడ్డి , ప్రేమనంద రెడ్డి ,ఆరే మల్లేశం, కొల్లూరి గంగాధర్ మున్నూరు కాపు కులస్తులు తదితరులు పాల్గొన్నారు..
.