ప్రార్ధించే చేతుల కన్న సహాయం చేసే చేతులు మిన్న

సరస్వతి స్వచ్ఛంద సేవా సంస్థ లో ఘనంగా శేఖర్ సాగర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్ ): సాగర సంగం రాష్ట్ర అధ్యక్షుడు స్వచ్ఛ తెలంగాణ దిన పత్రిక సంపాదకులు శేఖర్ సాగర్ జన్మదిన వేడుకలు సోమవారం సుభాష్ నగర్ డివిజన్ సరస్వతి స్వచ్ఛంద సేవా ఫౌండేషన్ లో పిల్లల మధ్య కుత్బుల్లాపూర్ జర్నలిస్ట్ లు గజమాల తో సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.వారికి కేక్ స్వీట్లు పంచి భోజనాలు వడ్డించారు.అనంతరం వారు మాట్లాడుతూ  పుట్టినరోజు వేడుకలు, పెళ్లి రోజు వేడుకలను అనాధ ఆశ్రమం లో తల్లి తండ్రులు లేని పిల్లల మధ్య జరుపుకోవడం సంతోషమని పిల్లలకు మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఉన్నత చదువులు చదువుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మహంకాళి సుధీర్,సీనియర్ జర్నలిస్ట్ సుగ్రీవుడు, శ్రావణ్, జుట్టు సాయి, విష్ణు, దుర్గ ప్రసాద్, సగర సంగం రాష్ట్ర నాయకులు స్టేట్ జనరల్ సెక్రటరీ గౌరక్క సత్యం సగర, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, పెద్దబుద్దుల సతీష్ సగర, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ సురేష్ సగర, స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ మహేందర్ సగర్, స్టేట్ యూత్ కోశాధికారి సాయి గణేష్,యువజన నాయకులు నితిన్ సగరలు పాల్గొన్నారు.

.