మాజీ ఎమ్మెల్యే రాములు కు ఘన నివాళులు అర్పించిన జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): దివంగత మెటుపల్లి మాజీ శాసనసభ్యులు కొమిరెడ్డి  రాములు పేద ప్రజల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు

సోమవారం దివంగత కొమిరెడ్డి రాములు జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాములు చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. 

ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ కమిటీఉపాధ్యక్షుడు నయీమ్, వేగ్యారపు మురళి, కటుకం  చంద్రశేఖర్, కడకుంట్ల గంగాధర్, రియాజ్, సోగ్రాభి, ఆనంద్ గౌడ్,  పెరుమాండ్ల నారాయణ గౌడ్, తేలు రాజకుమార్ తదితరులు ఉన్నారు

.