తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని లిటిల్ జీనియస్ హై స్కూల్ కి చెందిన 25 మంది విద్యార్థులు కరీంనగర్ లోని పారామిత పాఠశాలలో పది రోజులపాటు ఎన్సీసీ క్యాంపుకు హాజరయ్యారు.
ఈ కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ లో విద్యార్థులకు మ్యాప్ రీడింగ్, వెపన్ ట్రైనింగ్, యోగ ,పెరేడ్, ఫిజికల్ ట్రైనింగ్ మొదలగు అంశాలపై శిక్షణను ఇచ్చారు.
అనంతరము వీరు ఎన్సిసి ఏ సర్టిఫికెట్ పొందేందుకు అర్హత పరీక్ష రాయనున్నారు. విజయవంతంగా ఎన్సిసి శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన విద్యార్థిని విద్యార్థులను మరియు ఎన్సిసి ట్రైనింగ్ ఆఫీసర్ సంఘ మహేష్ ను పాఠశాల కరస్పాండెంట్ బండి మహదేవ్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు ప్రిన్సిపల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
.