నిందితుడిని శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ ఠాణా ముందు గిరిజనుల ధర్నా

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని కోరుతూ గిరిజనులు ఎల్లారెడ్డిపేట ఠాణా ను ముట్టడించారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పై ధర్నా రాస్తారోకో నిర్వహించారు.  సంఘటన వివరాల్లోకి వెళితే  వీర్నపల్లి మండలం బాబాయి చెరువు తండా గ్రామానికి చెందిన బానోతు మమత (21)  గురువారం  అనుమానాస్పదంగా ఊరి వేసుకొని  బలవన్మరనానికి పాల్పడింది.

తమ కూతురిని ప్రేమించిన వ్యక్తి మరొకరితో కలిసి ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లితండ్రులు ఆరోపించారు. నిందితులను వెంటనే తమకు అప్పజెప్పాలని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ముందు సుమారు 20 నిమిషాలుగా ధర్నా చేశారు. సమాచారం అందుకున్న సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి,  ఎల్లారెడ్డిపేటకు చేరుకొని బాధితులతో మాట్లాడి తగు న్యాయం చేస్తమాని హామీ ఇచ్చినట్లు సమాచారం.

.