విద్యార్ధి దశనుండి ఉపాధ్యాయ సంగం నేత వరకు తెలంగాణ ఉద్యమం చేశాను : విశ్రాంత ఉపాధ్యాయుడు ముశి కం దత్తాద్రి గౌడ్ మనోగతం

విద్యార్ధి దశనుండి ఉపాధ్యాయ సంగం నేత వరకు తెలంగాణ ఉద్యమం చేశాను.

తొలిదశ తెలంగాణ ఉద్యమం లో తీవ్ర కష్టాలు పడ్డాము.

ప్రత్యేక రాష్ట్రము కొరకు అలుపెరుగని తెలంగాణ ప్రజల పోరాట తెలంగాణ రాష్ట్ర  సాకారం.

విశ్రాంత ఉపాధ్యాయుడు ముశి కం దత్తాద్రి గౌడ్ మనోగతం.

తెలంగాణ ప్రభ  (పుల్లారెడ్డిపేట): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ము జూన్ 2న జరుపుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటుకు ప్రజలు అలుపెరుగకుండా చేసిన పోరాట ము,మొక్కవోణీ ధైర్యంతో జరిపిన ఉద్యమమే అని ఎల్లారెడ్డి పేట మండలములోని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన తొలిదశ, మలిదశ తెలంగాణ రాష్ట్ర పోరాటములో పాల్గొన్న విశ్రాంత ఉపాధ్యాయుడు ముశి  కం దత్తాద్రి గౌడ్ పేర్కొన్నారు.తాను తొలి దశ తెలంగాణ ఉద్యమం లో విద్యార్ధిగా,మలిదశ పోరాటంలో ఉపాధ్యాయ సంగం నేతగా పాల్గొన్నానని, తెలంగాణ ప్రజలందరి ఐక్య పోరాటం తోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము సిద్ధించ్చిందని తెలిపారు.

ఆంధ్రప్రభకు  తెలంగాణ పోరాటం జరిగిన తీరును విశ్రాంత ఉపాధ్యాయుడు దత్తాద్రి గౌడ్ వివరించాడు. తొలి దశ ఉద్యమం తీవ్ర కష్టం ఎదుర్కిన్నామని అనేక మంది ఆనాడు అమరులు అయ్యారన్నారు.1969-70 లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము కొరకు ఉద్యమం ప్రారంభం అయిందని అప్పుడు తాను ఎల్లారెడ్డి పేట హై స్కూల్ లో విద్యార్థి సంఘ నాయకుడిగా విద్యార్థుల ఓటింగ్ ద్వారా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యానన్నారు. అదే సమయంలో మర్రి చెన్నారెడ్డి నేత్రత్వంలో మొదలయిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం  లో పాఠశాలల, కళాశాలల, యూనివర్సిటీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో విద్యార్తి ఉద్యమముగా మారిందని దాంతో 1976 వరకు విద్యార్థులు తమ కేరిర్లో తీవ్రంగా నష్ట పోయారాన్నారు. తాను కూడా ఒక విద్యా సంవత్సరము నష్టపోయాయని తెలిపారు.1969లోనే బొప్పా పూర్ గ్రామంలో తెలంగాణ పేరిట కార్యాలయం ఏర్పాటు చేసి తన సహ చర మిత్రులతో ఉద్యమంలో పాల్గొన్నానన్నారు.

గ్రామానికి చెందిన ఎం డి అల్తాఫ్ హుస్సేన్, గాండ్ల ఆంజనేయులు తో పాటు అనేక మంది మిత్రులు, గొల్లపల్లి గ్రామానికి చెందిన విద్యార్ధి కాకున్నా పాతూరి సత్యనారాయణ రెడ్డి తనతో ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు.

అప్పటి నినాదం పాట రూపంలో ఆంధ్రవాళ్ళను వెళ్లి పొమ్మనుటకు ఇలా పాటలు పాడమని తెలిపారు.

గోంగూర కానే వాళ గో ఆంధ్రవాలా గోబ్యాక్.

పోకుంటే చూడు మల్ల - మారేంగే లాతు సాల అని  విద్యార్థులు గా తెలంగానుండి ఆంధ్ర వాళ్ళను వెళ్లి పొమ్మని పోరాడినట్లు తెలిపారు.

అదే సమయంలో కరీంనగర్ పార్ల మెంటు కు ఎన్నికలు వచ్చాయని కామారెడ్డి కూడా ఆనాడు కరీంనగర్ పార్ల మెంటు లోకి వచ్చేది అని ఇక్కడి నుండి ఎం సత్యనారాయణ రావు  తెలంగాణ ప్రజా సమితి పార్టీ నుండి పార గుర్తుతో పోటీ చేశారాని  ఆయనకు మద్దతుగా  కామారెడ్డి లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొనుటకు కామారెడ్డి వెళ్లి నట్లు సభ పూర్తి కావడానికిరాత్రి సమయంపట్టిందని అప్పట్లో రవాణా సౌకర్యం, ఫోను సౌకర్యం లేదని, నావద్ద, నా మిత్రుల వద్ద డబ్బులు లేక కామారెడ్డి నుండి బొప్పా పూర్ కు నడక ప్రారంభించిట్లు,  చలి కాలం కావడం చలికి ఆకలి తట్టుకోలేని పరిస్థితి తో మార్గ మధ్యలో చెలలో శెన గ తోటలో షేనక్కాయ కాల్చుకు తిన్నామని, అనంతరం భవాని పేటవరకు నడుస్తు వచ్చి అప్పట్లో అక్కడ చక్కెర ప్యాక్టరి వుండేదాని చెరుకు గడలు తిని మంచినీళ్లు త్రాగి ఆకలి తీర్చుకొని లారీ లో ఊరికి చేరు కున్నామని తెలిపారు. ఆలా విద్యార్ధి ఉద్యమం ఉస్మానియా విద్యార్థులతో ఉవ్వేతు న ఎగసి పడిందని అందులో పాల్గొన్న తాను నష్ట పోయిన ఉపాధ్యాయుడిని అయ్యానన్నారు.

అనంతరం 2011 లో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన మలి దశ ఉద్యమంలో ఉపాధ్యాయ సంగం నాయకుడిగా పాల్గొన్నానని పి అర్ టి యు  మండల, రాష్ట్ర బాద్యుడిగా తెలంగాన రాష్ట్రము కొరకు ఉద్యమామము చేశానని అన్నారు.ఉద్యోగులపై అప్పటి ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామన్నా బయపడలేదని, ఉద్యోగం పోతుందని వెనుకడుగు వేయలేదని 

ఉపాధ్యాయ సోదరా ఉద్యమించి లేవరా.

ఎస్మా చట్టానికి నీవు 

ఆధరోద్దు బెధరోద్దు.

ఒంటరిగా నీవు లేవు 

సంఘ బలము కలదురా 

అంటూ పాటలతో ఉపాధ్యాయ వర్గాల్లో ధైర్యాన్ని నింపి పోరాటం చేశామని తెలిపారు.

గౌడ సంగం నాయకుడిగా గౌడ కులస్థులను పోరాటం లో పాల్గొనేలా, ఉద్యోగ జే ఏ సి తో కలిసి సకల జనుల సమ్మె, వంటా వార్పు లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ పోరాటం చేసినట్లు ఉద్యమం తో కొంత నష్ట పోయినా చివరికి తెలంగాణ రాష్ట్రము సాధించామన్నా  తృప్తి మిగిలింది అని అది చాలు ఈ నా జీవితానికి అంటూ మనోగతాన్ని పంచుకున్నారు విశ్రాంత ఉపాధ్యాయుడు దత్తాద్రి గౌడ్. అయనకు ఆంధ్రప్రభ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

.