ప్రజాస్వామ్య బద్దంగా మున్నూరు కాపు సంఘ జిల్లా. ఎన్నికలు నిర్వహిస్తాం-.రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ప్రజాస్వామ్య బద్దంగా మున్నూరు కాపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ మున్నూరు కాపు సంఘము రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా మున్నూరు కాపు మండల,గ్రామ సంఘాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా  రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్ హాజరు కాగా జిల్లా అధ్యక్షుడు బాధినేని రాజేందర్ అధ్యక్షుతన జరిగింది.

ఈ సమావేశంలో కొండ దేవయ్య మాట్లాడుతూ రాష్ట్ర సంఘ అనుమతి లేకుండా వొడ్నాల రాజ శేఖర్ అనే వ్యక్తి తనకు తానే జిల్లా అధ్యక్షుడని ,కార్యదర్శి రమణ అని ప్రకటించడాన్ని ఖండిస్తూ ఆ కార్యవర్గం చెల్లదన్నారు. 

ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల నిర్వహణకు కమిటీని ప్రకటించారు. ఓటర్ల జాబితా తయారు చేయించి జిల్లాలోని అన్ని మండలాల వారు ఎన్నికల్లో పాల్గొనవచ్చన్నారు.

ఎన్నికలు పూర్తి అయ్యి  కొత్త బాడీ ఎన్నికయ్యేంత వరకు జిల్లా అధ్యక్షుడుగా బాధినేని రాజేందర్,ప్రధాన కార్యదర్శి బండారి రాజ్ కుమార్ కార్యవర్గమే కొనసాగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులుగా డాక్టర్ ఆరిగేల ఆశోక్,హరి ఆశోక్ కుమార్, కందుకూరి రవి బాబు,బైరం హరి కిరణ్,న్యాయవాది జంగిలి మల్లికార్జున్,కొలగాని శ్రీనివాస్,సాయిని పాపన్న,చెదలు సత్యనారాయణ, పడాల తిరుపతి,గంగం జలజ ను ప్రకటించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బాధినేని రాజేందర్,కార్యదర్శి బండారి రాజ్ కుమార్,రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్,జిల్లా కోశాధికారి దీటి అంజయ్య పటేల్,కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు,కొలగాని సత్తన్న,పట్టణ,మండల ప్రతినిధులు రంగు గోపాల్,మార్గం నర్సారెడ్డి,చెదలు సత్యనారాయణ,నేళ్ల రాజేశ్వర్ రెడ్డి,గురునాథం మల్లారెడ్డి,అమిరిశెట్టి మల్లా రెడ్డి,ఎర్ర నర్సన్న,బొలిశెట్టి నారాయణ,నీరటీ గంగ రెడ్డి,పాదం తిరుపతి,ముద్దం గంగరాజం,పిట్ట లింగారెడ్డి,గాదె తిరుపతి,సిరిపురం రాజేశం,కౌడ వెంకటి,చిట్ల రవీందర్,భారతపు లింగారెడ్డి,సంఘ మండల,గ్రామాల,పట్టణ ప్రతినిధులు పాల్గొన్నారు

.