తెలంగాణ ప్రభ (కోరుట్ల): కన్న తల్లి,దండ్రులను పోషించక నిరాధరిస్తున్న కొడుకులు ,కోడళ్లకు తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు కౌన్సిలింగ్ చేయడంతో తాము తమ తల్లిదండ్రులను పోషిస్తూ,బాగోగులుచేసుకోవడానికి సమ్మతించి ఒప్పంద పత్రం రాసిచ్చారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ కార్యాలయం కౌన్సిలింగ్ కేంద్రంకు ఆ కొడుకులు,కొడళ్లను ఆ తల్లిదండ్రుల అభ్యర్థన పై పిలిపించి వయోవృద్ధుల చట్టంపై అవగాహన కల్పించి,తల్లిదండ్రులను పోషించక, నిరాదరణకు గురిచేస్తే ట్రిబ్యునల్ అధికారి ఆర్డీవో 3 మాసాలకు పైగా జైలు శిక్ష,జరిమానా విధించే వీలు ఆ చట్టంలో ఉందని,మాయ మాటలతో,బెదిరింపులతో వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, అట్టి ఆస్తులు తిరిగి ఆ తల్లిదండ్రుల పేరిట మార్పిడి చేసే అధికారం జిల్లా కలెక్టర్ కు ఉందని కౌన్సిలింగ్ చేశారు.
జిల్లా కేంద్రానికి చెందిన తక్లూరి కమలమ్మను ఆమె పెద్ద కుమారుడు ,పెద్ద కోడలు,చిన్న కొడుకు,చిన్న కోడలు పోషించక వేధింపులకి గురి చేస్తున్నారని ,కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన జగిత్యాలలో అద్దెకు ఉంటున్న తల్లిదండ్రులు జనుగాల హన్మాండ్లు,సత్తమ్మను జగిత్యాలలోనే వివిధ వృత్తులు చేసుకుంటున్న ఇద్దరు కుమారులు,కోడళ్లు వేధింపులకు గురిచేస్తున్నారని , సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ కు ఫిర్యాదు చేయడంతో అసోసియేషన్ గౌరవ సలహాదారు మాజీ మున్సిపల్ చైర్మన్ జీ.ఆర్.దేశాయ్,ప్రతినిధులు గౌరిశెట్టి విశ్వనాథం,వి.ప్రకాశ్ రావు,పట్టణ ఆద్యక్షుడు సీనియర్ న్యాయవాది పి.సతీశ్ రాజ్ ,ఎం.డి.యాకూబ్ తదితరులు ఆ కనికరం లేని కొడుకులు,కోడళ్లకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో వారు ఆ తల్లిదండ్రులను పోషిస్తామని,లేకుంటే తమపై చట్ట ప్రకారము ట్రిబ్యునల్ చైర్మన్ అయిన ఆర్డీవో కు కేసు దాఖలు చర్యలు తీసుకోవాలని ఒప్పంద పత్రం రాసిచ్చారని జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజన్స్ అస్సోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.
ఈ కౌన్సిలింగ్ లో సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షులు బొల్లం విజయ్,ఎం.డి.యాకుబ్, ఎం.డి.ఇక్బాల్,పట్టణ అధ్యక్షుడు సతీశ్ రాజ్,సింగం గంగాధర్, విజయలక్ష్మి,కొడుకులు,కోడళ్లు,తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.
.