మెటుపల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలో తొలగించబడిన ఖాదీ కళా వేదికను పునర్ నిర్మాణం చేయండి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలో గల తొలగించబడిన ఖాదీ కళావేదికను పునర్నిర్మాణం చెయ్యించి,  ఆ పాత మధుర జ్ఞాపకాలను ప్రతిష్ట ను భావితరాలకు అందించి కళా వారసత్వాన్ని వైభవంగా నిర్మాణం చేయాలని కళాకారుడు కోటగిరి వెంకటస్వామి డిమాండ్ చేశారు

ఈ సందర్భంగా కళాకారుడు కోటగిరి వెంకట స్వామి మాట్లాడుతూ..ఖాది గ్రామోద్యోగ్ సంస్థ ఏర్పడినప్పుడు  అట్టి ఖాదీ ఆవరణలో పాలన భవనం ముందు నిర్మించబడిన కళవేదిక దశబ్దాల కాలంగా ఖాది ప్రతిస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన  నవరాత్రి సందర్భంగా కార్యక్రమాలకు మెటుపల్లి క్లబ్ ద్వారా నాటిక, నాటక ప్రదర్శనలకు మన మెటుపల్లి పాత తాలూకా ప్రాంత పరిధిలోని సాంఘిక, ధరణిక ప్రదర్శనలకు శాస్త్రీయ పద్య ప్రదర్శనలకు నిలయమై మన మెటుపల్లి పట్టణ కీర్తిని కళా రంగ వైభవాన్ని నలుదిశాల వ్యాప్తికి ఆధారమైన కేంద్రబిందువైనా ఖాదీ నవీకరణలో భాగంగా తొలగించబడడం చాలా బాధాకరమని పట్టణంలోని సకల ప్రముఖులు కళా అభిమానులు కళాపోషకులు కళా విధేయులు, పాత్రికేయులు కవులు గాయకులు రంగస్థలం కళాకారులు అందరూ కూడా ఖాదీ ఆవరణలో యదావిధిగా కళావేదికతో కూడిన కళా ప్రాంగణాన్ని  నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నారు. 

 ఈ కార్యక్రమంలో కోటగిరి వెంకటస్వామి,మట్టెల గంగాధర్,సప్పరి శ్రీనివాస్, పరంకుశం నరసయ్య, కోటగిరి చైతన్య,ఎండి షబీర్ హుస్సేన్,అందే మారుతి,రంగు శ్రీనివాస్, ఇల్లెందుల శ్రీనివాస్,ఎలిగేటి కృష్ణ,కవులు కళా కారులు తదితరులు పాల్గొన్నారు.

.