కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ని సూటిగా నిలదీసిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు
తెలంగాణ ప్రభ (కోరుట్ల): అవినీతిపై బహిరంగ చర్చకు వచ్చే దమ్ముందా సంజయ్ నీకు అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ని సూటిగా నిలదీశారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు టెలిఫోన్ టాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కుటుంబానికి చెందిన కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల సంజయ్ నీ కుటుంబం చేసిన అవినీతిపై అక్రమార్జనపై మీ తండ్రి కొడుకులు చేసిన మోసాలపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ని సూటిగా నిలదీశారు
ఎమ్మెల్యే టికెట్ కోసం తండ్రి కొడుకులు గొడవపడి నువ్వు ఇంట్లో విధ్వంసం సృష్టించావని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన విషయం ప్రజలు ఇంకా మర్చి పోలేదని ఆయన అన్నారు
ఈరోజు జువ్వాడి కృష్ణారావు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం అంటేనే అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లని కల్వకుంట్ల కవిత అవినీతి కేసులో జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుటుంబం కోరుట్ల నియోజకవర్గాన్ని దోచుకుందని ఆయన అన్నారు
వీరందరికి కూడా త్వరలోనే టెలిఫోన్ టాపింగ్ కేసులో శిక్ష తప్పదని ఆయన అన్నారు
కల్వకుంట సంజయ్ తమ కుటుంబం పైన ఆరోపణలు చేశారని, ఉన్నత విద్యావంతుడైన జువ్వాడి నర్సింగరావు పై ఆరోపణలు చేయడం నీ అవివేకానికి నిదర్శనం కోరుట్ల నియోజకవర్గంలో కేవలం డాక్టర్ చదివిన వాళ్లే డాక్టర్లే ఓట్లు వేస్తేనీవు గెలవలేదని డాక్టర్లతో పాటు న్యాయవాదులు, ఇంజనీర్లు, వివిధ రంగాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఎందరో ఉన్నారని అలాంటి ఉన్నత విద్య వంతులను అవమానించేలా మాట్లాడడం మానుకొవాలని ఎమ్మెల్యే సంజయ్ నీ కృష్ణారావు హెచ్చరించారు
నీ తండ్రి మాజీ ఎమ్మెల్యే కల్వకుంట విద్యాసాగర్ రావు ఏం చదివాడని ఏం ఉద్యోగం చేసి ఇన్ని ఆస్తులు సంపాదించాడని ఆయన అన్నారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా సమయంలో హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ కాలనీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏ 1/1 నెంబరు గల ఎమ్మెల్యే క్వార్టర్ లో అప్పటి బుగ్గారం ఎమ్మెల్యేగా ఉన్న తమ తండ్రి జువ్వాడి రత్నాకర్ రావుతో కలిసి తామంతా ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉన్నామని, అప్పుడు పై అంతస్తులో ఏ 1/4 నెంబరు గల క్వార్టర్లో కెసిఆర్ కుటుంబం నివాసం ఉన్నారని ఆయన అన్నారు
ఆ సమయంలో కేసీఆర్ కు టెలిఫోన్ కనెక్షన్ కూడా లేదని తమ ఇంట్లోని టెలిఫోన్ ను ఉపయోగించుకునేవాడని ఈ విషయాలన్నీ విషయ పరిజ్ఞానం లేని ఈ సంజయ్ కి ఏం తెలుసాని ఆయన అన్నారు. 1995లో కెసిఆర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంత్రి అయ్యారని అన్నారు కానీ అవగాహన లేని సంజయ్ కెసిఆర్ 1989 లోనే మంత్రిగా ఉన్నారని ఆయన అన్నారని ఆయనకు చరిత్ర మీద రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉండదని ఆ తండ్రీ కొడుకులకు కేవలం డబ్బు సంపాదన మీద ఎంత అవినీతికి పాల్పడిన సరే ఎంత మెరకు డబ్బు సంపాదించాము అనేదాని మీద మాత్రమే అవగాహన ఉంటుందని ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ఆయన అన్నారు
కెసిఆర్ కు కారు కూడా లేని రోజుల్లో ఆయన మోటార్ సైకిల్ పై తిరిగిన రోజుల్లో తమ కుటుంబానికి 1986 లోనే ఏఐయు 2626 నెంబర్ గల పిఎట్ కారు ఉందని అవగాహన లేని సంజయ్, జువ్వాడి నర్సింగరావు ఆ రోజుల్లో మోటార్ సైకిల్ పై తిరిగాడని అనడం హాస్యాస్పదమని అన్నారు కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి నర్సింగరావు 2014.2018.2023 ఎన్నికల్లో పోటీ చేస్తే 5 ఎన్నికల్లో ఓడిపోయావు అని సంజయ్ మాట్లాడడం ఆయనకు నియోజకవర్గంపై ఏ మాత్రం అవగాహన లేదని అనడానికి నిదర్శనమని ఆయన అన్నారు
నేను డాక్టర్ ను అని చెప్పుకుంటున్న ఆయన అల్జీమర్స్ వ్యాధితో అంటే జ్ఞాపకశక్తి లేకపోవడం అనే వ్యాధితో బాధపడుతున్నారని, ముందు దానికి వైద్యం చేయించుకోవాలని జువ్వాడి కృష్ణారావు సూచించారు.
గతంలో నీ తండ్రి కోరుట్ల మాజీ ఎమ్మెల్యే ఒక వ్యక్తికి భూమి అమ్ముతానని చెప్పి అగ్రిమెంట్ చేయించి, డబ్బులు తీసుకుని ఇంకో వ్యక్తి పేరున భూమి రిజిస్ట్రేషన్ చేశారని ఆయన అన్నారు
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తన కుటుంబానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై ఎక్కడైనా బహిరంగ చర్చకువస్తే తానుఅందుకు సిద్ధంగా ఉన్నానని, సంజయ్ నువ్వే బహిరంగ చర్చకు వేదిక సమయం నిర్ణయించు ఆ సమయానికి నేను మీ కుటుంబం చేసిన పూర్తి అవినీతి మోసాలకు సంబంధించిన పూర్తి సాక్షాదారాలను తీసుకొని అక్కడికి వస్తానని కృష్ణారావు సవాల్ విసిరారు
నీకు దమ్ముంటే మాపై చేసిన అవినీతి ఆరోపణలు కూడా నీవు నిర్ణయించిన తేదీ, నీవు నిర్వహించిన వేదికపైనే నిరూపించు అని ఆయన అన్నారు.
.