మెదక్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయం

సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి స్రవంతి చంద్ర గౌడ్ 

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి స్రవంతి చంద్ర గౌడ్ అన్నారు ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దేశ రక్షణ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చూసి దేశవ్యాప్తంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టారని వారు తెలిపారు నాలుగో తారీఖు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు భారీ మెజార్టీతో గెలుపు ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు తెలిపారు

.