తెలంగాణ ప్రభ (కోరుట్ల): లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల మరియు కోటి నవ దుర్గ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జోన్ చైర్మన్ లయన్ అల్లాడి శోభ ప్రవీణ్ గారి సౌజన్యంతో స్థానిక వాసవి కళ్యాణ భవనం,కోరుట్ల లో నిర్వహించడం జరిగింది.
ఇట్టి శిబిరంలో మొత్తం 108 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించడం జరిగింది.
వారికి సుమారు 60 వేల రూపాయల వివిధ రకాల మందులు కూడా పంపిణీ చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వనపర్తి చంద్ర మోహన్ - రమ్య, కుందారపు మహేందర్ - ప్రేమలత, ట్రెజరర్ లు కొండబత్తిని కృష్ణ ప్రసాద్ - రాధిక పాల్గొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మన డాక్టర్ల బృందం క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ దిలీప్ రావు,IMA మాజీ అధ్యక్షులు డాక్టర్ అనూప్ రావ్ - డాక్టర్ స్వీతి, లయన్ డాక్టర్లు రేగొండ రాజేష్ IMA అధ్యక్షులు, రేగొండ ప్రియాంక,డాక్టర్ గండ్ర అన్వేష్ - డాక్టర్ శృతి, డాక్టర్ ఒడ్నాల నరేష్ వైద్య సేవలు అందించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో లయన్ లీడర్స్ PRC లు అల్లాడి ప్రవీణ్ - శోభ, ఆడెపు మధు - కమల, ఎలిమిల్ల ఉషాకిరణ్ - రజని, వడ్డేపల్లి శ్రీనివాసన్,PZC లు పోతని ప్రవీణ్ కుమార్,గుంటుక సురేష్ బాబు ,మంచాల జగన్, లయన్ సభ్యులు ఏలేటి లక్ష్మారెడ్డి,శ్రీగద్దె నరేంద్ర, గుంటుక మహేష్,మండలోజు రవీందర్, పడాల నారాయణ గౌడ్, పిడుగు గుణాకర్ రెడ్డి, కొమ్ముల జీవన్ రెడ్డి, కొత్త సునీల్ ,పోలాస రవీందర్,గండ్ర రాధిక తదితరులు పాల్గొన్నారు.
.