తెలంగాణ ప్రభ (కోరుట్ల): నటరత్న పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి టిడిపి ఆవిర్భావ దినోత్సవ నేత నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కోరుట్ల పార్టీ కార్యాలయములో నియోజక వర్గ ఇంచార్జ్ మానుక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఫోటోకి పూలదండ వేసి, కేకు కట్ చేసి అనంతరo ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణి చేశారు. మానుక ప్రవీణ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టిoచారని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు రూపాయలకే కిలో బియ్యం పథకo, జనతా వస్త్రాలు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, గృహ నిర్మాణ పథకాలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, తెలుగు ప్రజలలో రాజకీయ చైతన్యం, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపట్టి చరిత్ర సృష్టించిన ఘనత ఎన్టీఆర్ అని ఆయన అన్నారు
నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా దేశ రాజకీయాలలో చక్రం తిప్పి, ఈరోజు తెలుగు ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఘనత ఎన్టీఆర్ అని మానుక ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమoలో టిడిపి నాయకులు గజ్జల్లి రాజ గణేష్, ఎనుగందుల శ్రీనివాస్, పాతర్ల విజయ్ కుమార్, బద్దం మోహన్, బాలే మారుతి, అంజయ్య, నజీర్, చిలువేరి మహేశ్వరి, విజయ, సబ్మాసుల శాంత, రాణి, లక్ష్మీ, దివ్య, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
.