తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్ తన కార్యాలయంలో అనుచరులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
పలువురు మాట్లాడుతూ... నిన్న కోరుట్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి పై చేసిన వాక్యాలను ఖండిస్తున్నామన్నారు. జీవన్ రెడ్డి చిన్న స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఎదిగిన వ్యక్తి, ఇప్పటివరకు కూడా ఆయన మీద ఎటువంటి అవినీతి ఆరోపణాలు లేవు,అంతటి మహోన్నత వ్యక్తిని విమర్శించే నైతిక హక్కు కల్వకుంట్ల సంజయ్ కు లేదని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాంపరింగ్ చేసి కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు ఓటమికి కారకులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు,స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ కన్వీనర్ (మైనారిటీ డిపార్ట్మెంట్)అబ్దుల్ హఫీజ్ మెటుపల్లి మండలం వైస్ ప్రెసిడెంట్ ఇల్లేందుల రాజు కౌన్సిలర్ యమ రాజయ్య మునిసిపల్ ఎక్స్ చైర్మన్ ఎర్రోళ్ల హనుమాన్లు మెటుపల్లి పట్టణ కార్యదర్శి కంబ సురేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
.