తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జగద్గిరిగుట్ట లోని రాజీవ్ గృహకల్ప లో నివసిస్తున్న రేణుక కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఆకాంక్ష ఫౌండేషన్ అధ్యక్షులు సిహెచ్ వి రామారావు వారు నివసిస్తున్న గృహానికి వెళ్లి ఆపన్న హస్తం అందించారు. వారికి కావలసిన మెడికల్ కిట్టు, బియ్యం,నిత్యవసర వస్తువులు, పండ్లు అందించారు. వారికి మనో ధైర్యం కలుగా చేసి, భవిష్యత్తులో అండగా ఉంటమని తెలిపారు. సహాయం అందించిన ఆకాంక్ష ఫౌండేషన్ కి బాధితురాలు రేణుక, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆకాంక్ష ఫౌండేషన్ సభ్యులు నవీన్ రామోజీ, అనిల్, సీనియర్ జర్నలిస్టులు ఎర్ర యాకయ్య, చంద్ర , తదితరులు పాల్గొన్నారు.
