మల్లంపేటలో కూల్చివేతలు
ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుండిగల్ గండి మైసమ్మ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో బాలాజీ లేఔట్ ఎలాంటి అనుమతి లేకుండా నిర్మిస్తున్న బిల్డింగును దుండిగల్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సంజన ఆధ్వర్యంలో మంగళవారం కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నుంచి అయినా నిర్మాణదారులు అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. ఈ కూల్చివేతలో చైన్ మెన్ సతీష్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
