ఎన్.టి.ఆర్. 101వ. జయంతి ఉత్సవాలు

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంప్ లో ఎన్.టి.ఆర్.  రామారావు 101వ. జయంతిని  ఘనంగా నిర్వహిస్తున్నామని కోటగిరి మీర్జాపూర్ క్యాంప్ కాలనీ వాసులు,ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు. ఉదయం 10 గంటలకు జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఎన్టీఆర్ కమిటీ సభ్యులు తెలిపారు. మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

.