మాజీ కోప్షన్ మెంబర్ హకీమ్.
తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని జల్లాపల్లి అభాధి గ్రామానికి చెందిన తారాచంద్ నాయక్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు అదే గ్రామానికి చెందిన మాజీ మండల కోప్షన్ మెంబర్ ఏం. ఏ. హకీం 10000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన వారి కుటుంబ సభ్యులకు మాట్లాడుతూ ...నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో వారికి ఇల్లు లేకపోవడంతో నిరాశకు గురయ్యారు .వారి ఇంటి నిర్మాణం కొరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడి ఇల్లు మంజూరు కొరకు తన వంతు కృషి చేస్తానని భరోసా కల్పించారు. ఈదురు గాలులతో మూడు కుటుంబాల ఇంటి పైకప్పు రేకులు లేచిపోవడంతో వారికి తన వంతుగా ఇంటి మరమ్మత్తుల కొరకు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీటీసీ రాములు, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ధనరాజ్, రూప్ సింగ్,జైసింగ్,పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
