తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని సాధుల నగర్ గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా అగ్రికల్ ఏవో ప్రతాప్ సీఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ మండలంలోని రైతులు విత్తనాలు కొనేముందు జాగ్రత్తలు పాటించాలని వారు తెలిపారు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినచో కఠిన చర్యలు తప్పవని వారు తెలిపారు రైతులకు ఇబ్బంది కలగకుండా తమ వంతు ఎల్లవేళలా కృషి చేస్తామని వారు అన్నారు ఫర్టిలైజర్ షాప్ వారు ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని వారు రైతులకు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు వనరి గారి వీరేశం చెక్కల సత్తయ్య చెక్కల ఆంజనేయులు పొట్లచెరువు యాదయ్య రైతులు పాల్గొన్నారు
