వినోద్ మృతి పట్ల సంతాపం తెలిపిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్  నాయకులు ఉయ్యాల వినోద్ గురువారం రాత్రి మరణించగా శనివారం రోజున సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు మృతుని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. 

జువ్వాడి కృష్ణారావు వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండలకాంగ్రెస్ అధ్యక్షులు కొంతంరాజాం, బలిజ రాజరెడ్డి, పసుల కృష్ణప్రసాద్, మొగిలి, దామకొండయ్య తదితరులు ఉన్నారు

.