సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి
తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల ఫాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరి ధాన్య కొనుగోలు కేంద్రంలో 120 మంది రైతులకు గను 8100 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి కొనుగోలు కేంద్రానికి వచ్చిన చివరి గింజ వరకు కొనుగోలు చేశామని సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సిరిసిల్ల ఫ్యాక్స్ ఆధ్వర్యంలో మొత్తం 20 కొనుగోలు కేంద్రాల గాను ఆదివారం రోజు 13 కేంద్రాలలో కొనుగోలు పూర్తి చేశామని, 1139 మంది రైతులకు గాను 1,50,000 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్ కు తరలించామని, 80% మంది రైతులకు ట్యాబెట్రీ పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని, ఈ కొనుగోలుకు సహకరించిన జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, పాలకవర్గ సభ్యులకు, రైతాంగానికి, సిబ్బందికి, హమాలీ సోదరులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
