హరిదాస్ నగర్ లో పోలీసులకు గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం
తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట)ఎల్లారెడ్డిపేట మండలంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, మండలంలోని 50 పోలింగ్ బూతులలో పోలింగ్ 74 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు,
పోలింగ్ కేంద్రాలలో ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. తొలి మూడు గంటల్లో 15 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది,
కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి తన స్వగ్రామమైన నామాపూర్ లో
కరీంనగర్ పార్లమెంట్ కో కన్వీనర్ గాంధీ బాపు తన స్వగ్రామమైన గజ సింగవరంలో అదేవిధంగా మరో కోకన్వీనర్ కటుకం మృత్యుంజయం పంతులు తన స్వగృమైన గంభీరావుపేట మండల కేంద్రంలో మరో కో కన్వీనర్ చక్రధర్ రెడ్డి తన స్వగ్రామమైన ముస్తాబాద్ మండల కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట మండలాలలో సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పోలి కేంద్రాలను ఓటింగ్ సరళిని మధ్యాహ్నం పరిశీలించారు
ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు ,
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయ్ తమ స్వగ్రామమైన నారాయణపురంలో , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , స్థానిక మాజీ సర్పంచ్ లు నేవూరి వెంకట్ రెడ్డి మమతా రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , దంపతులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తీట ఆగయ్య , జెడ్ పి టి సి లక్ష్మణరావు ఎంపీపీ పిళ్లి రేణుక , సెస్ డైరెక్టర్ కృష్ణ హరి , సింగల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి లు తమ స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అదేవిధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన 104 సంవత్సరాల వయస్సున్న ఎనగందుల నరసవ్వ వీల్ చేర్ లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు,
మండలంలోని హరిదాస్ నగర్ గ్రామంలో ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ పోలీసులు, హరిదాసునగర్ గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం జరిగి కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది,
ఎల్లారెడ్డిపేట వీర్న పెళ్లి మండలాలలో బిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీలు ఓటర్లకు ఎప్పుడు లేని విధంగా డబ్బులు మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేశారని
ఓటుకు 500 చొప్పున పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతుంది,
బిఆర్ ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ రావు డబ్బులు , మద్యం పంపిణీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు, బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ లకు ఓటర్లు ముగ్గు చూపినట్లు తెలుస్తోంది ,
సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగింది,
.