కుత్బుల్లాపూర్ లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చింతల్ డివిజన్,సుభాష్ నగర్ డివిజన్, కుత్బుల్లాపూర్ డివిజన్, జీడిమెట్ల డివిజన్ పరిధిలోని పోలింగ్ సెంటర్లను ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రాగిణి లక్ష్మారెడ్డి  పోలింగ్ సెంటర్లలో ఓటర్లకు అందుతున్న వసతులను, పోలింగ్ నిర్వహణను తెలుసుకోగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  పోలింగ్ సెంటర్ వెలుపల నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల నిర్వహణ తీరుపై చర్చించారు.

.