ప్రశాంతంగా ముగిసిన పోలింగ్.శభాష్ పోలీస్

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): పోలీస్. ఎల్లారెడ్డి పేట మండలంలో ఎంపీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికలకు ముందే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ,ఎస్.ఐ రమాకాంత్ లు అన్నీ రాజకీయ పార్టీల నాయకులకు సమావేశం నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించారు.ఎన్నికల సమయంలో ఎవరిపైనా కేసులు అయిన జీవితాంతం  కోర్టుల చుట్టూ తిరగవలసి ఉంటుందని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అవగాహన కల్పించారు. ఎన్నికలకు ఒక రోజు ముందు నుంచే సీఐ శ్రీనివాస్ గౌడ్ ,ఎస్. ఐ రమాకాంత్ లు పెట్రోలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి సహకరించడం తో పోలీస్ లు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామని సంతృప్తి వ్యక్తం చేశారు.

.