తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుండిగల్ మున్సిపాలిటీ, శంభిపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు. ఈ సంధర్భంగా శంభీపూరు రాజు మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలందరూ ఏకమై ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రతి ఓటర్ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.
