కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం

తెలంగాణ ప్రభ (కోటగిరి):  పోతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామంలో     మండల కాంగ్రెస్ పార్టీ   అధ్యక్షులు పుప్పాల శంకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి  ఈనెల 13న నిర్వహించే   పార్లమెంటు ఎన్నికల సందర్భంగా   ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే పథకాలను ఓటర్లకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వందరోజులకే నాలుగు పథకాలను వెంటనే అమలు చేయడం జరిగిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 500 గ్యాస్ సిలిండర్ అమలు చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికలు ముగిసిన  అనంతరం  మహిళలకు 2500 పింఛన్ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుందని అన్నారు.ఈ   పథకాలను దృష్టిలో పెట్టుకొని చేతు గుర్తుకు ఓటు వేసి జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జల్లాపల్లి ఫారం చాంద్ పాషా మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.