తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల లో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కె.ఆర్.సి.ఆర్ హరితవనం, ప్రగతి నగర్ అమరవీరుల స్తూపం ప్రాంతాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్సీ కేపీ. వివేకానంద ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్ల బిఆర్ఎస్ పాలన సంక్షేమం, అభివృద్ధికి నిదర్శనం అయితే... గత పదేళ్ల బిజెపి, నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన అబద్ధపు హామీలు, మోసపూరిత వాగ్దానాలకు నిదర్శనమన్నారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్ధకమేనన్నారు. కనీసం తెలంగాణ ప్రజల వానిని పార్లమెంట్లో వినిపించే నాయకుడే ఉండరన్నారు. కాబట్టి మే 13న జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని నాలుగవ నెంబర్ పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు, మేకల వెంకటేష్, బాలాజీ నాయక్, గాజుల సుజాత, రాఘవేందర్ రావు, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, సునీత, రాజేందర్ రెడ్డి, ఆయా డివిజన్ల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు అర్పిత ప్రకాష్, నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
.