బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం....ఎంపీపీ పడిగల మానస రాజు

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి);తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గుర్తు కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో  గెలిపించాలని ఎంపీపీ పడిగల మానస రాజు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎంపీపీ మానస రాజు మాట్లాడుతూ...కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిలో పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతుక బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించుకొని కరీంనగర్ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాజన్న, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచులు అంకారపు అనిత రవీందర్, కొడం సంధ్యారాణి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సద్ద రోజా, జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్, నందగిరి భాస్కర్ గౌడ్, శివ, బిక్షపతి, మహేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు

.