కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావు గెలిపించాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతోపాటు విౠ  గ్రామాల్లో  శనివారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,  ఎల్లారెడ్డిపేట  మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డిల  ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున వెయ్యి బైకులతో జైకు ర్యాలీ నిర్వహించారు, 

మండల  కేంద్రంతో పాటు నారాయణపురం,  సింగారం కోరుట్ల పేట, రాచర్ల బొప్పాపురం,  గొల్లపల్లి గ్రామాలలో శనివారం ఉదయం బైక్ ర్యాలీ నిర్వహించారు 

అనంతరం కీర్తీ శేషులు  స్వర్గీయ నేవూరి లక్ష్మీ మల్లారెడ్డి ఏసీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది ,

ఈ సందర్భంగా  బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి లు మాట్లాడుతూ 12 తేదీనా  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలక్షన్ నిబంధనలను పాటిస్తూ కండువాలు కరపత్రాలు లేకుండా  ఇంటి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి అభ్యర్థించాలని కోరారు ,

ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టపడ్డది వేరు 12,  13 వ తేదీలు వేరని కిలకమని  కార్యకర్తలు  కష్టపడి  కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల  రాజేందర్ రావు గెలుపు కోసం కృషి చేయాలని ఆయా బూతులలో వచ్చిన మెజార్టీని పరిగణలోకి తీసుకుని  కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నామినేట్ పదవులను ఇవ్వడం జరుగుతుందన్నారు,

పాత కొత్త తేడా లేకుండా అందరూ కలిసి అభ్యర్థి గెలుపు కోసం పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు ,

13వ తేదీ సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుందని  పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఎప్పటికప్పుడు  బూత్ ఏజెంట్ల ద్వారా తెలుసుకొని ఓటర్ల దగ్గరకు  వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు కు ఓటు వేయాలని చెప్పి  వారిని  పోలింగ్  కేంద్రాలకు తరలించాలని  ఒక్క ఓటర్ ను కూడా  మనం  మిస్ చేసుకోవద్దని సూచించారు , 

ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను  ఉద్దేశించి చరవాణి ద్వారా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు,

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల  రాజేందర్రావు మచ్చలేని మనిషి ప్రజా సేవకుడు ఆయనను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలను ఆయన కోరారు , 

ఈ బైక్ ర్యాలీ లో వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వెయ్యి బైక్ లతో పాల్గొన్నారు, 

సమావేశంలో బొప్పాపురం మాజీ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి , మాజీ జెడ్పిటిసి సభ్యులు ఏలూరి రాజయ్య , జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ గౌస్ బాయ్,  పందిళ్ళ లింగం, మేడిపల్లి దేవానందం ,మర్రి శ్రీనివాస్ రెడ్డి , గూడ విజయ రెడ్డి , మండల మహిళా అధ్యక్షురాలు ఆకుల లత,  మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ , మండల నాయకులు రఫీక్ , పందిళ్ళ సుధాకర్ గౌడ్ , గొల్ల కురుమ యాదవ సంఘం ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాల అధ్యక్షుడు మండే శ్రీనివాస్ యాదవ్ , ఎడ్ల రాజ్ కుమార్ జజ్జరి నర్సయ్య  తదితరులు పాల్గొని ప్రసంగించారు, 

బైక్ ర్యాలీలో సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుడిదా రాజేందర్, గుండోడి రాంరెడ్డి బుర్కా జ్యోతి ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ సభ్యులు నేవూరి రవీందర్ రెడ్డి  , బండారి బాల్ రెడ్డి , నంది కిషన్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు,  వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు వివిధ హోదాలో ఉన్న మండల నాయకులు  అందరు కలిసి బోజనాలు చేశారు,

.