బిజెపి నుండి దేశాన్ని కాపాడుకోవాలి : మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె (టోనీ)

దోచుకోవడం దాచుకోవడం లో బిజెపి, బిఆర్ఎస్ రెండు ఒక్కటే

మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె (టోనీ)

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో శనివారం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపుకు మద్దతుగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాలగం ప్రవీణ్ (టోనీ) ఆధ్వర్యంలో ఇంటి ఇంటి ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు టోనీ మాట్లాడుతూ..మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చాలని అలాగే బీసీ,ఎస్సీ మైనార్టీల రిజర్వేషన్లు ఎక్కువ ఇయ్యాలని పన్నాగం కొనడం జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్రం నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్  పూర్తి మద్దతు తెలుపుతూ తమ అహంకార ధోరణి ప్రదర్శిస్తూ మరొకసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు ఈ రెండు పార్టీలు అధికారంలోకి వస్తే దేశ రక్షణకే ఆటంకం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృద్ధి దయంగానే పనిచేస్తుంది ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో కాంగ్రెస్ ముందుంటుందని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలను ఆదుకుంటుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరుతూ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు),అసెంబ్లీ యూత్ అధ్యక్షులు చుక్క శేఖర్, ఫిషర్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్,ఉప సర్పంచి పెద్దూరి తిరుపతి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాం నరేష్, కొంపల్లి శ్యామ్, కొండ రాజు,  దూస మహేందర్, గోరింటాల రాజమల్లు, చిలుక శ్రీనివాస్, అడిగొప్పుల యమున, జంగంపల్లి భాగ్యలక్ష్మి, తదితరులు గ్రామ మహిళాలు పాల్గొన్నారు.

.