తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని బసవేశ్వర విగ్రహం వద్ద బసవేశ్వర జయంతిని ఉమ్మడి మండలాల వీర శైవ లింగాయత్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి సందర్భంగా మాజీ సబాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బసవేశ్వర పుట్టినరోజు సందర్భంగా మహిళలందరూ కలిసి బసవేశ్వర్ విగ్రహం వద్ద ఉయ్యాల వేసి జన్మదిన శుభాకాంక్షలు మండల ప్రజలందరికీ తెలిపారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మానికప్పలు మాట్లాడుతూ.... ప్రతి యేటా మండల కేంద్రాలలోని, గ్రామాలలో మాత్మ బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలలో మహిళలు సైతం ప్రత్యేక పూజలు చేసి చిత్రపటాలకు నివాళులర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్రెడ్డి జెడ్పిటిసి శంకర్ పటేల్ విశాల సహకార సంఘం అధ్యక్షులు శాంతేశ్వర్ పటేల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మణికప్ప ,మాజీ జడ్పీటీసీ శివరాజ్ దేశాయ్ కోటగిరి ఉమ్మడి మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హమీద్,హన్మంత్ రావు పటేల్,శివ చరణ్ పటేల్,వినోద్,హౌగెరావు పటేల్ , దిగంబర్ పటేల్ విశ్వ0బర్ పటేల్,సంజీవ్ పటేల్,నీతూ పటేల్,ఒమన్న పటేల్ తదితరులు పాల్గొన్నారు.
