మహిళ సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : టిపిసిసి ప్రధాన కార్యదర్శి జ్యోత్స్న శివారెడ్డి

అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాంబ

టిపిసిసి ప్రధాన కార్యదర్శి జ్యోత్స్న శివారెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కొంపల్లి లోని కె.వి.ఆర్ కన్వెన్షన్ హాల్ లో మేడ్చల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ న్యాయ్ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ఆల్కాంబ, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, ఏఐసీసీ పార్లమెంట్ అడ్వైజర్ ఎంపీ జ్యోతి మనీ, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత టిపిసిసి ప్రధాన కార్యదర్శి జ్యోత్స్న శివరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాలలో ముందు ఉంచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీలో ప్రతి మహిళకు గౌరవం కల్పిస్తామని మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరి వర్ధన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కుత్బుల్లాపూర్  ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి, కోఆర్డినేటర్ శోభారాణి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.