తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఎంపీసీ బైపిసి కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ ముబీన్ ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీల 60 సీట్లు ఎస్సి 4, ఎస్టీ 4, బిసి 10 ,ఓసీలకు 2 సీట్లు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 10వ తరగతి పూర్తి చేసిన వారు సకాలంలో అడ్మిషన్ చేసుకోగలరని ఆయన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు కోరారు.
