తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని కోడిచర్ల గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింట తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు ఓటర్లకు కోరారు. కార్యక్రమంలో మల్లేష్ మువ్వ శేఖర్ ఫున్నె సాయిలు బిఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులు పార్టీ కార్యకర్తలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.
