శ్రీరాముని పేరు చెప్పి ఓట్ల అడగడం సబబేనా... ఎంపీ అభ్యర్థి గుర్రపు మచ్చేందర్

తెలంగాణ ప్రభ (కోటగిరి):  కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో జహీరాబాద్ ఏ.ఐ.ఎస్.బి అభ్యర్థి గుర్రపు మచిందర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ...

 - పదవులు ముఖ్యం కాదు - ప్రజల కోసం పనిచేయడమే తన లక్ష్యమని అన్నారు. రాముడు అందరివాడని కానీ కొందరు రాముని పేరు చెప్పి ఓట్ల అడుక్కుంటున్నారని  ఆయన అన్నారు.  9 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎందుకు  మీడియా ముందుకు రాలేదని  ఆయన ప్రశ్నించారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం లేకనే ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలగా బిఆర్ఎస్ ఎంపీగా ఉండీ బి ఆర్ఎస్ అధికారం కోల్పోగానే  తన బిజినెస్లను కాపాడు కోవడం కోసం మాత్రమే బిజెపిలో పార్టీలో  చేరారె తప్పు పనిచేయడం కోసం కాదని  ఆయన అన్నారు. కావున బడుగు బలహీన వర్గాల అభ్యర్థిగా బరిలో ఉన్న  తనను సింహం గుర్తుకు ఓటు వేసి  భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.

.