తెలంగాణ ప్రభ (కోటగిరి): బాన్సువాడనియోజకవర్గంలోని పొతంగల్ మండలంలోని కల్లూరు లింగాపూర్ జల్లాపల్లి జల్లాపల్లి ఫారం, పోతంగల్ కోటగిరి గ్రామాలలో పర్యటించి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచార భాగంలో ఓటర్లకు ప్రజలకు కోరారు. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు. నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన పథకాలను నెరవేర్చారాన్ని ప్రజలను అడిగారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన పథకాలను ఆయన చదివి వినిపిస్తూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు పదిహేను వేలు, కింటాకు 500 రూపాయలు బోనస్, 24 గంటల ఉచిత విద్యుత్, కౌలు రైతుకు ఎకరాన పదిహేను వేలు, ఉపాధి హామీ కూలీలకు సంవత్సరంకు 12000, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా లక్షతో పాటు తులం బంగారం, మహిళలకు 2500 రూపాయలు,ఆసరా పింఛన్ నెలకు 2000 నుండి 4000 వరకు పెంచుట, ఎక్కడ అమలు చేశారని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మవద్దని ఆయన అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధిని చూసి జహీరాబాద్ అభ్యర్థిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, జడ్పిటిసి శంకర్ పటేల్ జిల్లా కోప్షన్ మెంబర్ సిరాజ్ ఉమ్మడి మండలాల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఎజాజ్ ఖాన్ , మాజీ ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ అమీద్ సహకార సంఘం అధ్యక్షులు కూచి సిద్దు మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ శ్రీధర్ బాబు అనిల్ కులకర్ణి , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
