ఆయా పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరిక

-ఆరు గ్యారంటీలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారు.

-నియోజక వర్గ ఇంఛార్జి ఏనుగు రవిందర్ రెడ్డి.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని హరిజనవాడ కాలనీలో సహకార సంఘం  సొసైటీ మహిళా డైరెక్టర్లు కన్నం లక్ష్మీ, పెంట సాయవ్వతో పాటు  బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గ్రామ గ్రామాన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల్లో చేపట్టబోయే పథకాలను వివరించారు.  జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ను  భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను, కార్యకర్తలను ఆయన కోరారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం మహిళలకు 2500 ,గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, రైతులకు వరి ధాన్యంపై బోనస్ 500 రూపాయలు ఇవ్వడం   జరుగుతుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు  ఒక్క లక్ష రూపాయలతో పాటు తులం బంగారం , ఇల్లులేని నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షాహిద్ హుస్సేన్ డిసిసి ఉపాధ్యక్షులు గంగాధర్ దేశాయ్ ఎంపీటీసీ కొట్టం మనోహర్ సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి కిషోర్ బాబు బర్ల మధు పొతంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల శంకర్ మాజీ ఎంపీటీసీ సలీం జంగం సాయిలు,ఇందూర్ సాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.