తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో గల దుర్వేషావలి దర్గా ఉత్సవాలకు రావాలని బుధవారం రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కు , ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు నిర్వాహకులు షేక్ అజీజ్ ఆధ్వర్యంలో ముస్లిం కమిటీ సోదరులు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు షేక్ అజిజ్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన ఉరుసు ఉత్సవాలలో భాగంగా కవ్వాలి కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని అన్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి చాలామంది భక్తులు ప్రతి సంవత్సరం తమ మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు రెండు రోజులపాటు హాజరవుతారన్నారు. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. రెండు రోజులపాటు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. 15వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ను , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను ఆహ్వానించిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి , మర్రి శ్రీనివాస్ రెడ్డి కి నాయకులు జి మల్లేశం బండారి బాల్ రెడ్డి , ఎల్లారెడ్డిపేట మండలం ముస్లిం కమిటీ అధ్యక్షుడు షేక్ షాదుల్లా, కాంగ్రెస్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సాహెబ్, మసీద్ కమిటీ ఉపాధ్యక్షులు సయ్యద్ లాల్ మహమ్మద్, మహమ్మద్ ఫజల్ , కోశాధికారి లారి హైమద్ , పాల్గొన్నారు.
