కోటగిరిలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని పలు బూత్ కేంద్రాలలో బూత్ కన్వీనర్లు జిల్లా మైనార్టీ  నాయకుకుని ఆధ్వర్యంలో  ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్  పార్టీ ఎన్నికల్లో చేపట్టబోయే పథకాలపై ప్రచారం నిర్వహించారు.చేతు గుర్తుకు ఓటు వేసి  జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్  షెట్కార్ ను భారీ మెజారిటీతో  గెలిపించాలని ఓటర్లకు కోరారు .ఎన్నికల్లో చేపట్టబోయే పథకాలపై అవగాహన కల్పిస్తూ మేనిఫెస్టో వివరాలను చదివి వినిపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున బడుగు బలహీన వర్గాలకు మైనార్టీ వర్గానికి న్యాయం చేకూర్తుందని మైనార్టీ జిల్లా నాయకులు తెలిపారు. రైతులకు ఆగస్టు నెల 15 తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేయడం జరుగుతుందని తెలిపారు మహిళలకు 2500 పింఛను మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా  మైనార్టీ కార్యదర్శి వహీద్ హుస్సేన్ వాజీద్ జుబేర్ ఖాన్ ఆసిఫ్ అబ్దుల్లా నజీర్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.