తెలంగాణ ప్రభ (కోటగిరి):బాన్సువాడనియోజకవర్గంలోని కోటగిరి మండలం ఎత్తోండ గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి రాష్ట్ర బీజేపీ పార్టీ ఉపధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తూ ఎన్నికల్లో బిజెపి పార్టీ చేపట్టబోయే పథకాల గురించి క్లుప్తంగా వివరించారు.ఉపాధి హామీ కూలీలకు రోజువారి వేతనం పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కూలీలకు భరోసా ఇచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని బీబీ పాటిల్ ను గెలిపించాలన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మీ గ్రామం నుండి భారీ మెజార్టీని ఇవ్వాలని ఉపాధి హామీ కూలీలకు కోరారు. ఈ ప్రచారంలో కోటగిరి మండల బిజెపి అధ్యక్షుడు వేముల నవీన్,యువ మోర్చా అధ్యక్షుడు జగదీష్ కమలాకర్ శంకర్ శ్యాంసుందర్ నాగేష్ చంద్రశేఖర్ సాయికుమార్ విలాస్ గణేష్ మహిళా అధ్యక్షురాలు మేతరి మల్లమ్మ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
