బిఆర్ఎస్, బిజెపి గోవిందా పాట ఆవిష్కరణ

ఒక్క పాటతో ప్రభుత్వాలు మారాయి కొలను హన్మంత్ రెడ్డి

తెలంగాణను తెచ్చింది కవులు కళాకారులు 

ప్రజా కళాకారుడు దరువు అంజన్న.

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): గత పది సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి  రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాలు, ప్రజలను ప్రకృతి వనరులను దోచుకున్న తీరును కళ్ళకు కట్టినట్టుగా ఈ పాట రూపంలో తీసుకురావడం జరిగింది, తెలంగాణలో కవులు కళాకారులు ఉద్యమాన్ని ముందుండి నడిపారని కుత్బుల్లాపూర్  కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొలాన్ హనుమంత రెడ్డి అన్నారు,

 కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా కళాకారుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  నాయకులు దరువు అంజన్న రచించి గానం చేసిన గోవిందా గోవిందా బిఆర్ఎస్, బిజెపి గోవిందా అనే పాట ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజ్గిరి నుండి కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని  ధీమా వ్యక్తం చేశారు. 

 ఈ కార్యక్రమంలో గౌస్ పాషా,  మహిళా నాయకురాలు పాల్గొన్నారు.

.