తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ పట్టణంలోని ఆవుల రాజిరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ఈనెల తొమ్మిదవ తేదీన నర్సాపూర్ పట్టణంలోని పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగబోయే జన జాతర సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరు అవుతారని ఆయన అన్నారు కావున నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన తెలిపారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బడుగు బలైన వర్గాలకు చెందిన నీలం మదును చేతు గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
