తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని హెగ్డోలి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటా తిరుగుతూ కారు గుర్తు ఓటు వెయ్యాలని గ్రామ ప్రజలకు ఓటర్లకు కోరారు. రాంబాబు మాట్లాడుతూ... జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. బిఆర్ఎస్ పార్టీ చేపట్టబోయే పథకాలపై ఓటర్లకు క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
