తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండలంలోని కొత్తపల్లి దేవునిగుట్ట తండా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోలింగ్ బూత్ కేంద్రాల ఇంచార్జిలు చాంగం కృష్ణరెడ్డి బోడే కొండారెడ్డి సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఆకర్షితులై కొత్తపల్లి యువకులు దేవుని గుట్ట కార్యకర్తలు పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రతీ కార్యకర్తకు పలు కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తానాని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి కారు గుర్తుకు ఓటు వేసి మోసపోవద్దని యువకులకు ఆయన సూచించారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను దేవుని గుట్ట తండా కొత్తపల్లి గ్రామాల నుండి అధిక మెజార్టీని ఇవ్వాలన్నారు. చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కొత్తపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుప్పల దత్తాత్రి దేవుని గుట్ట అధ్యక్షుడు కోర్ర జైపాల్ మెగావత్ కిషన్ మాజీ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పుప్పల గంగారాం,తదితరులు పాల్గొన్నారు.
