పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజును అభినందించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): పర్యావరణ పరిరక్షణ కోసం అనునిత్యం తపిస్తూ ఇంకుడు గుంతలు తీయండి, వర్షపు నీటిని ఒడిసి పట్టండి అంటూ పర్యావరణ ప్రేమికుడు కోలా రవీందర్ ముదిరాజ్ నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు రాజుగారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తమ మద్దతును తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరారం కాలనీ లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశానికి వెళ్తున్న సమయంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద తారసపడిన పర్యావరణ పరిరక్షణ వాహనాన్ని ఆపి పర్యావరణ పరిరక్షకుడు కోల రవీందర్ ముదిరాజుకు తమ మద్దతుని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమృద్ధిగా నీరు, పచ్చదనం, సకాలంలో వర్షాలతో పర్యావరణం బాగుంటేనే మానవ మనుగడ సాధ్యమన్నారు. కావున పర్యావరణ ప్రేమికులే కాకుండా ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ఇందుకు అనుగుణంగానే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పర్యావరణ పరిరక్షణకై ప్రత్యేక నిధులు కేటాయించి పచ్చదనాన్ని పెంచామన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని వడిసిపట్టినట్లయితే భూగర్భ జలాలు అడుగంటవన్నారు. అనంతరం కోల రవీందర్ ముదిరాజును వారు శాలువాతో సత్కరించారు.
