తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన వివిధ పార్టీ లకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బానోత్ రాజు నాయక్, మాజీ ఎంపీ టీసీ సభ్యులు రాజేందర్ , భాస్కర్ జాదవ్ ఆద్వర్యంలో మంగళవారం ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేరారు ,
గుండారం గ్రామానికి చెందిన నలుగురు కాంగ్రెస్ పార్టీ లో చేరగా వారికి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి లు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు,
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు , కాంగ్రెస్ పార్టీ నాయకులు రఫీక్ , మల్లేశం , బండారి బాల్ రెడ్డి , మహాబూబ్ . మునీ సింగ్ నాయక్, మూడోవంతు తిరుపతి నాయక్, భూక్యా ప్రశాంత్ నాయక్ , గుగులోత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
.